KIDS - WORLD
విశ్వాస జీవితంలో పెరగడానికి పిల్లలకు మార్గనిర్దేశం చేయండి
బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
సామెతలు 22:6
యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము. నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను. సామెతలు 9:10-12.
పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే (కీర్తనలు 127:3). పిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు విద్యకు మంచి సంరక్షకులుగా ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఇవ్వబడింది. పిల్లలకు లేఖన సత్యాలను బోధించడం వలన వారిని జ్ఞానులుగా చేస్తుంది (2 తిమోతి 3:15) మంచి పనులు చేయుటకు వారిని ప్రోత్సహిస్తుంది. (2 తిమోతి 3:17) మరియు వారి నిరీక్షణకు కారణం అవుతుంది (1 పేతురు 3:15). దేవుడు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. (ద్వితీయోపదేశకాండము 6:6-7). తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. (ఎఫెసీయులకు 6 : 4)